Thursday, June 22, 2017

ఝలక్

కొత్త కోడలు భీకరంగా ఏడుపు మొదలుపెట్టింది ..చూళ్ళేని అత్తగారు అనునయంగా అడిగింది "ఏమయింది తల్లీ ..?"

కోడలు : నేను దయ్యంలా కనిపిస్తున్నానా ??

అత్త : లేదే .

కోడలు :నా కళ్లు కప్ప కళ్ళులా ఉన్నాయా ??

అత్త : అస్సలు లేదు .

కోడలు :నా ముక్కు పకోడీ లా ఉందా .?

అత్త : లేదమ్మా ..

కోడలు : నేను గేదెలా నల్లగా లావుగా ఉన్నానా .?

అత్త : అబ్బబ్బా ..అలాలేవు గానీ ఇవన్ని ఎవరన్నారు నీకు ..?

కోడలు : మన ఇరుగు పొరుగువాళ్ళు ..నువ్ అచ్చంగా మీ అత్తగారిలా ఉన్నావంటున్నారు ..వా ..వాఁ

అత్తగారు కోడలి ఝలక్ కి ఇప్పట్లో తేరుకోలేని కోమాలో ఉన్నారు ..!!!

😝😝😁😁😍😍🤑🤑
🤑🤑😁😁😜😜😀😀😝😝

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version