ఒకసారి టీచర్ పాఠం చెబుతూ ఒక స్టూడెంట్ ని అడుగుతుంది.
టీచర్: రవీ.. 'I' తో మొదలయ్యే ఒక ఇంగ్లీష్ sentense చెప్పు?
రవి: " I is the...
టీచర్: ఆగాగు. I తరువాత ఎప్పుడూ am రావాలి, is వాడకూడదు...
రవి: OK. I am the ninth letter of the alphabet.
Saturday, September 29, 2012
పర్‌ఫెక్ట్
A: మా అబ్బాయి పర్‌ఫెక్ట్. తెలుసా?
B: మీ వాడు smoke చేస్తాడా?
A: లేదు
B: మరి మందు తాగుతాడా?
A: లేదు
B: పోనీ ఇంటికి లేట్ గావస్తాడా?
A: అబ్బే ఆ సమస్యే లేదు.
B: నాకు తెలిసి నిజంగానే మి అబ్బాయి పెర్‌ఫెక్టే. మీవాడి వయసెంత?
A: వచ్చే బుధవారానికి ఐదు నిండి ఆరు నెలలొస్తాయి...
B: ఆ(
Friday, September 28, 2012
అమ్మాయే
A: చూడండి ఆ వ్యక్తి యెలా బట్టలేసుకున్నాడో ఆ జీన్సు ప్యాంటు ... పూల చొక్కా ... ఆ జుట్టూ... ఇంతకీ అసలావ్యక్తి అబ్బాయంటారా? అమ్మాయంటారా?
B: అమ్మాయే. తను నా కూతురు.
A: ఓ.. క్షమించండి సర్... మీరు ఆ అమ్మాయికి తండ్రనుకోలేదు.
B: తండ్రిని కాదు . తన తల్లిని .
B: అమ్మాయే. తను నా కూతురు.
A: ఓ.. క్షమించండి సర్... మీరు ఆ అమ్మాయికి తండ్రనుకోలేదు.
B: తండ్రిని కాదు . తన తల్లిని .
Wednesday, September 26, 2012
500 రూపాయలు
A. ఏంటి? ఇంత లేట్ అయింది
B. అక్కడ ఒకతను 500 రూపాయల నోట్ పోగొట్టుకున్నాడు.
A. వెరీ గుడ్. వెతకడంలో సహాయపడుతున్నావా?
B. కాదు. నేను ఆ నోట్ మీద నుంచున్నాను.
B. అక్కడ ఒకతను 500 రూపాయల నోట్ పోగొట్టుకున్నాడు.
A. వెరీ గుడ్. వెతకడంలో సహాయపడుతున్నావా?
B. కాదు. నేను ఆ నోట్ మీద నుంచున్నాను.
Tuesday, September 25, 2012
ఎప్పుడైనా చేపలు పట్టావా?
మారుతీ రావు తన కొత్త కారులో ఝుమ్మున హైవేలో దూసుకెల్తున్నాడు. తన పక్కనున్న vehicles కూడా అంతే వేగంతో దూసుకెల్తున్నాయి. అయితే అంతవేగం అక్కడ నిషిద్దం, కానీ రూల్స్ ఎవరూ పట్టించుకోకుండా ఎవరి బిజీలో వారు ఉన్నారు. ఇంతలో ఒకచోట ఒక ట్రాఫిక్ పోలీస్ మన మారుతీ రావు కారు ఆపి వేగంగా వెల్తున్నందుకు fine కట్టమన్నాడు.
మారుతీ రావు: నేను వేగంగా వెల్తున్న మాట నిజమే గానీ ఇంతమంది వేగంగా వెల్తున్నారు. నా దగ్గర ఒక్కడిదగ్గర మాత్రమే fine వసూలు చెయ్యడం ఏమీ బాలేదు.
ట్రాఫిక్ పోలిస్: నువ్వెప్పుడైనా చేపలు పట్టావా?
మారుతీ రావు : హా. అది నా హాబీ.. అయితే !!!
ట్రాఫిక్ పోలిస్: మరి చెరువులో చేపలన్నీ పట్టం కదా
మారుతీ రావు: :-!!!!

Monday, September 24, 2012
పిడుగు, విద్యుత్తు మధ్య తేడా
ఫిజిక్స్ టీచర్: పిడుగు, విద్యుత్తు మధ్య తేడా ఏమిటి చెప్పు
తెలివైన చిన్నారి: మెరుపుకు మనం చెల్లించపనిలేదు. అయితే విద్యుత్తు బిల్లులు మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందే.
తెలివైన చిన్నారి: మెరుపుకు మనం చెల్లించపనిలేదు. అయితే విద్యుత్తు బిల్లులు మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందే.
ఫస్ట్
తల్లి: చిన్నీ! మీ క్లాస్‌లో ఎప్పుడన్నా దేనిలోనన్నా ఫస్ట్ వచ్చావా?
చిన్ని: బెల్ కొట్టగానే క్లాస్ ఏం ఖర్మ, మొత్తం స్కూల్లోనే బయటికొచ్చేయడంలో నేనేగా ప్రతిరోజూ ఫస్ట్.
చిన్ని: బెల్ కొట్టగానే క్లాస్ ఏం ఖర్మ, మొత్తం స్కూల్లోనే బయటికొచ్చేయడంలో నేనేగా ప్రతిరోజూ ఫస్ట్.
Saturday, September 22, 2012
సన్మానం
సుబ్బారావు : నమస్తే మాస్టారూ ! రేపు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మీ దంపతులిద్దరికీ సన్మానం చేద్దామనుకుంటున్నామండీ. మీరు కాదనగూడదుమరి.
మాస్టారు : మాకు సన్మానమా? ఎందుకండీ?
సుబ్బారావు : మరి మన అపార్టుమెంటులో ఎప్పుడూ ఆనందంగా , అన్యోన్యంగా ,ఆదర్శంగా ఉండేది మీరే. మీరూ, మీయావిడా ఎప్పుడూ నవ్వుకుంటూ ఉంటారుగదా .అందుకని.
మాస్టారు : నవ్వుకోవడవా! మరేంలేదండీ, మాయావిడ నాపైకి గ్లాసులూ, గంటెలూ విసురుతూంటుంది. అవి నాకూ తగలలేదనుకోండి – అప్పుడు నేను నవ్వుతాను , తగిలిందనుకోండి మాయావిడ నవ్వుతుంది. అంతే.
సుబ్బారావు : ఆఁ......

Friday, September 21, 2012
Thursday, September 20, 2012
డైటీషియన్
లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజీవ్. ఆ డాక్టర్ అదో టైపు.
సంజీవ్ : సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?
డాక్టర్: ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే.
సం: వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
డా. ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?
సం: వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
డా: అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు?
సం: పోనీ మద్యం మానేయాలంటారా?
డా: ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది? వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ? బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు. పళ్ళు తిన్నంత ఆరోగ్యం.
సం: మరి ఐస్‌క్రీమ్‌స్, చాక్‌లెట్లు..
డా: లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై ప్రోడక్ట్సే కదా!
సం: వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు. నిజమేనా?
డా:ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా.ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది.
సం: అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు ..
డా: చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా!
సం: పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా?
డా: ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?
సం: మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి?
డా: రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?
సం: ???????

టీచర్
టీచర్: రామూ. సరిగ్గా జవాబు చెప్పు. ఎదుటివారికి వినే ఆసక్తి లేదని తెలిసినా ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉండే వారిని ఏమంటారు?
రాము: టీచర్ అంటారు.
Tuesday, September 18, 2012
చీకటి
ఇద్దరు factory workers యిలా మాట్లాడుకుంటున్నారు.
మొదటివాడు: నేను ఎలాగైనా మన Owner చేత ఇవ్వాళ సెలవ ఇప్పించుకుంటా!!
రెండవవాడు: అదెలాగ?
(ఇంతలో ఆ factory owner రావడం గమనించి మొదటివాడు గదిలో fan కి వ్రేలాడుతూ ఉంటాడు )
యజమాని: అక్కడేంచేస్తున్నావ్?
మొదటివాడు: నేను లైటుని...
యజమాని: నీకు పనెక్కువ చెయ్యడంవల్ల బుర్ర పాడైనట్టుంది గానీ ఇంటికెళ్ళి రెస్టు తీసుకో...
(రెండవ వాడు కూడా మొదటి వాడిని అనుసరిస్తూ వెళ్ళబోతాడు)
యజమాని: నువ్వెక్కడికిరా?
రెండవవాడు: ఇంటికి వెళ్తున్నా అయ్యగారు. నేను చీకటిలో పనిచెయ్యడం నా వల్ల కాదు...

Progress Card
కిట్టు: కోపం, బాధ రెండూ తగ్గడానికి మందులేమైన ఉన్నాయా మెడికల్ షాపతన్ని అడిగాడు.
మెడికల్ షాపతడు: ఇవిగో, ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికెలో మాయమవుతుంది. ఇంతకీ ఎవరికీ బిళ్ళలు? అని అడిగాడు.
కిట్టు: ఇంకెవరికి, మా నాన్నకే. ఇవాళ నా ప్రోగ్రెస్ రిపోర్టు చూపించాలి అని చెప్పాడు.

Monday, September 17, 2012
ఆలస్యం
క్లాసుకు ఆలస్యంగా వచ్చిన సుధను నిలదీసింది లెక్చరర్"నేను కాలేజీకి వస్తుంటే ఒకబ్బాయి నన్ను వెంబడించాడు మేడమ్..! అందుకే లేటయ్యింది" చెప్పింది సుధ"అయితే మాత్రం ఇంత ఆలస్యం ఎందుకైంది?""నేను ఫాస్ట్‌గా నడిచినప్పటికీ ఆ అబ్బాయి చాలా స్లోగా వెంబడించాడు మేడమ్...!!!"
Sunday, September 16, 2012
Saturday, September 15, 2012
Men - Women
ఒకావిడ రాత్రంతా ఇంటికి రాకుండా తెల్లారి వస్తుంది. భర్త రాత్రంతా ఎక్కడికెళ్ళావని అడుగుతాడు. తన ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నానని చెబుతుంది. తరువాత భర్త తన భార్యకు close friends అయిన ఓ పది మందికి call చేసి ఆడుగుతాడు. ఆ పదిమంది ఆ రాత్రి తమదగ్గర లేదని చెబుతారు.
ఈసారి భర్త late వస్తాడు. భార్య అడిగితే friend దగ్గర ఉన్నానని అంటాడు. తరువాత భార్య తన భర్తకు close friends అయిన ఓ పదిమందికి phone చేస్తుంది. పదిమందిలో 5గురు రాత్రి తమవద్దనే ఉన్నాడని చెబుతారు. మిగతా ఐదుగురు ఇంకా తమతోనే ఉన్నాడని అంటారు.
Moral: Men are the best friends

చెవినొప్పి
"చుక్కలమందు పనిచెయ్యడం లేదని మూడు రోజుల క్రితం మీ దగ్గరకు వస్తే...చుక్కలమందుకు బదులు మాత్రలు వాడమని చెప్పారు కదా...! అవి వాడాక చెవినొప్పి ఎక్కువైంది డాక్టర్...!" చెప్పాడు పేషెంట్."అలా జరగడానికి వీల్లేదే.. రోజుకు ఎన్ని మాత్రలు వాడావు...?" అడిగాడు డాక్టర్"రెండే సరే. ఈ చెవిలో ఒకటి, ఆ చెవిలో ఒకటి వేసుకున్నా" అంతే డాక్టర్...!!!
Friday, September 14, 2012
సినిమా యాడ్స్
టీచర్: ఏంట్రా రవీ! తలనొప్పి, రొంప, దగ్గు అని బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళావట?
గోపీ : అవునండీ. సినిమా యాడ్స్‌లో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని.
గోపీ : అవునండీ. సినిమా యాడ్స్‌లో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని.
ఇంటి కుక్క
టీచర్: నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు మళ్ళీ రెండు కుక్కలు ఇచ్చాననుకో. నీ దగ్గర మొత్తం ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: కాదు. ఇప్పుడు చెప్పు. నీకు నేను మొదట రెండు నారింజపళ్ళు, మరి రెండు నారింజపళ్ళు, మళ్ళీ రెండు నారింజపళ్ళు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని నారింజపళ్ళుంటాయి?
సంతోష్: ఆరు!
టీచర్: గుడ్. ఇప్పుడు చెప్పు. నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు, ఇంకా రెండు కుక్కలు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: రెండేసి కుక్కలు మూడు ఒకటిగా కలిపితే ఏడెలా అవుతాయి బాబూ?
సంతోష్: ఇప్పటికే ఇంటిదగ్గర నాకు ఒక కుక్క ఉంది కదా టీచర్!
Thursday, September 13, 2012
కారు
నా కారు keys ఖచ్చితంగా కార్లోనే మర్చిపోయుంటాను. అనుమానంగా parking lot వైపుకు అడుగువేశాను. మా ఆయన ఎప్పుడూ నన్ను కార్లో keys మరచిపోతుంటానని తిడుతూ ఉంటారు. నా లెక్క ప్రకారం కారు ఇంజన్ on లో ఉన్నప్పుడు కారెవ్వరూ దొంగిలించలేరని, కానీ మా వారి లెక్కప్రకారం అలా ఇంజన్ ఆన్ చేసినప్పుడే కారు దొంగిలించే అవకాశం ఎక్కువ అని. చివరికి మావారి లెక్కే నిజమయింది. పార్కింగ్ లాట్ ఖాళీగా ఉంది.
నేను వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి నా అడ్రస్ చెప్పి కారు వివరాలతో కంప్లైంట్ ఇచ్చాను.
ఆఖరుగా బాధతో మా వారికి కాల్ చేశాను. "రాజేష్ ఈ! తాళాలు కార్లో మర్చిపోయాను, మన కారెవరో ఎత్తుకెళ్ళారు .!!!"
కొంచెం సేపు మౌనం , తను కాల్ కట్ చేసుంటాడనుకున్నా. కాని వెంటనే తన voice వినబడింది, " Idiot, నిన్ను drop చేసింది నేనే.
ఇప్పుడు మౌనం నా వంతయింది. ఓ నిజమా! Thank God, వచ్చి నన్ను pick-up చేసుకో...
"ఓ ఖచ్చితంగా... ఈ కారు నాదేనని ఈ పోలీస్ వాళ్ళని convince చెయ్యగానే వచ్చేస్తాను.
Wednesday, September 12, 2012
ఆఫ్ర్టాల్ చేయి
అధికారి- ఎందుకు అలా అంత పెధ్దగా అరుస్తున్నావ్.?
సైనికుడు- నా చేయి తెగి పడిపోయింది సార్... అయ్యే నొప్పి.
అధికారి- అక్కడ తలలు తెగి పడిపోయినవారే సైలెంట్ గా ఉన్నారు. ఆఫ్ర్టాల్ చేయి తెగినందుకే అంత గొడవ చేస్తున్నావ్.
వెధవ
సునీల్: ఏరా.. నువ్వు ఎప్పుడూ వెధవలాగే మాట్లాడుతుంటావెందుకురా?
అనిల్: అలాగయితేనే నీకు బాగా అర్థమవుతుందనీ..
Tuesday, September 11, 2012
స్వీట్ పాకెట్
వరుణ్: చీమలను ఎందుకురా ఫాలో అవుతున్నావు?
వాసు: స్వీట్ పాకెట్‌ను అమ్మ దాపెట్టేసిందిరా. చీమల బారును అనుసరిస్తే స్వీట్ దగ్గరకి అవే తీసుకుపోతాయిగా
వాసు: స్వీట్ పాకెట్‌ను అమ్మ దాపెట్టేసిందిరా. చీమల బారును అనుసరిస్తే స్వీట్ దగ్గరకి అవే తీసుకుపోతాయిగా
Monday, September 10, 2012
Phone Call
శంభులింగం: ఏరా జంభూ! ఏంట్రా నీ దవడ ఎర్రగా కమిలిపోయింది?
జంభులింగం: (విసుగ్గా) పొద్దున నేను బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉండగా ఎవడో ఫోన్ చేశాడురా . ఫోన్ అనుకొని ఇస్త్రీ పెట్టె అంటించుకున్నా!
శంభులింగం: అయ్యో! అది సరేరా మరి రెండో దవడ కూడా ఎందుకు కమిలిపోయింది?
జంభులింగం: దరిద్రుడు ... వాడు మళ్ళీ ఫోన్ చేశాడురా (భోరున ఏడుస్తూ...)

సందేహం
ఒకరోజు నాలుగో తరగతి చదువుతున్న దీప్తి వంటగదిలో పనిచేసుకుంటున్న వాళ్ళమ్మదగ్గరకు వెళ్ళి అదేపనిగా వాళ్ళ అమ్మని గమనిస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళమ్మ అడుగుతుంది.
"ఏమిటే! ఏం ఆలోచిస్తున్నావ్?"
దీప్తి: నీకు కొన్ని వెంట్రుకలు తెల్లగా ఎందుకున్నాయమ్మా?
దానికి వాళ్ళ అమ్మ అంటుంది "నువ్వు అల్లరి చేస్తూ చదువుకోకుండా చికాకు చేస్తూ నన్ను ఏడిపిస్తావుగా! అలా ఏడిపించినప్పుడల్లా ఒక్కో వెంట్రుక తెల్లబడిపోతుంది"
ఇంతలో ఆ పాప మెల్లిగా తన ధర్మ సందేహాన్ని యిలా వెల్లబుచ్చుతుంది "మరి అమ్మమ్మ వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోయాయెందుకు? "

Saturday, September 8, 2012
నటురె-పుటురె
ఇంగ్లీషు క్లాసులో రాము లేచి " మాస్టారూ! నటురె అంటె అర్ధం ఏంటండి?" అని అడిగాడు.
మాస్టారికి అర్ధం కాలేదు. " నటురెనా.....అదేం పదం? ’" అని అడిగాడు. మాస్టారికి కూడా తెలియని పదాన్ని గురించి తను అడుగుతున్నానని రాముకు గర్వంగా అనిపించింది. "అదే మాస్టారూ...ఎన్...ఎ...టి...యు...ఆర్...ఇ " అన్నాడు.
మాస్టారికి కోపం వచ్చింది. "వెధవాయ్! ఆ పాఠం నేను నెల రోజుల నుండి చెబుతున్నాను. అయినా దాన్ని సరిగ్గా ఎలా పలకాలో నీకు తెలియలేదా? దాన్ని నేచర్ అని పలకాలి. ఆ మాత్రం తెలియనివాడివి నా క్లాసులో ఉండకు. పో... ఇంకో వారం దాకా నా క్లాసులో కనిపించకు పో..." అని అరిచాడు.
రాము ఇంటికి వెళ్ళి తండ్రి సోముకు జరిగినది చెప్పి ఏడ్చాడు. సోము మాస్టారితో మాట్లాడతానని చెప్పి కొడుకుని ఓదార్చాడు. మర్నాడు బడికి వెళ్ళి ఇంగ్లీషు మాస్టారిని కలిశాడు సోము"మాస్టారూ! వారం రోజులు మావాడు ఇంగ్లీషు పాఠాలు వినకపోతే వాడి పుటురె దెబ్బ తింటుంది కదా?" అన్నాడు.
అంతే మాస్టారి కోపం నషాలానికెక్కింది. "పుటురెనా?.. అదేంటి?.."అన్నాడు. సోము అన్నాడు " అదే మాస్టారు!
ఎఫ్...యు...టు...యు...ఆర్...ఇ..
మాస్టారు "?????????????????"
Friday, September 7, 2012
వేలు
అమ్మ: ఏమైంది నాన్నా ఏడుస్తున్నావు?
రవి: వేలు కోసుకున్నామ్మా
అమ్మ: ఎప్పుడు?
రవి: రెండు గంటలయ్యింది
అమ్మ: మరి ఇప్పుడు ఏడుస్తున్నావే?
రవి: అప్పుడు నువ్వు లేవు గదమ్మా...!
రవి: వేలు కోసుకున్నామ్మా
అమ్మ: ఎప్పుడు?
రవి: రెండు గంటలయ్యింది
అమ్మ: మరి ఇప్పుడు ఏడుస్తున్నావే?
రవి: అప్పుడు నువ్వు లేవు గదమ్మా...!
Thursday, September 6, 2012
మంచి స్థితి
శ్యామ్: మా మామయ్యకింద 500 మంది ఉంటారు తెలుసా!
భీమ్: ఓహో, అలాగయితే మీ మామయ్య చాలా మంచి స్థితిలో ఉన్నట్లే లెక్క
శ్యామ్: అదేం లేదు. తను స్మశానంలో కావిలి కాస్తుంటాడులే.
భీమ్: ఓహో, అలాగయితే మీ మామయ్య చాలా మంచి స్థితిలో ఉన్నట్లే లెక్క
శ్యామ్: అదేం లేదు. తను స్మశానంలో కావిలి కాస్తుంటాడులే.
Wednesday, September 5, 2012
చిన్న రన్‌వే
ఒక విమానాశ్రయం బాగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఒక airliner తన విమానాన్ని లాండ్ చేద్దామనుకుంటాడు. అక్కడ మంచు ఎదుటి మనిషి కూడా కనపడనంత దట్టంగా ఉంది. ILS సిస్టం blink అవుటూ ఉంది కాబట్టి పైలట్ విమానాన్ని ఖచ్చితంగా తన చాకచక్యంతో లాండ్ చెయ్యాల్సిఉంది. తన కోపైలట్ కు సిస్టం చెక్ చెపుతాడు.
"Flaps, check"
కోపైలట్: Landing Gear, check, Altitude, check. Right
"ok, we're going in. జాగ్రత్తగా ఉండు" అంటుండగానే వెంటనే రన్‌వే చివరకు వెలిపోతుందా విమానం.
పైలట్: ఓ మై గాడ్!!! నేను చూసిన రన్‌వేస్ అన్నింటిలో ఇది అత్యంత చిన్న రన్‌వే
అంతలో కోపైలట్ పక్కకు చూపిస్తూ "అవును, అత్యంత వెడల్పైనది కూడా ఇదే అనుకుంటా "
Tuesday, September 4, 2012
లెక్కల పరీక్ష
శ్రుతి: ఈ రోజు లెక్కల పరీక్షలో మంజు ఒకే ఒక మార్కు తెచ్చుకుంది. దాన్ని ఐదుగా దిద్దిందని టీచర్ కనిపెట్టేసింది!
తాతయ్య: నువ్వు అలాంటి పని ఎప్పుడూ చెయ్యవనుకుంటాను. అవునా?
తాతయ్య: నువ్వు అలాంటి పని ఎప్పుడూ చెయ్యవనుకుంటాను. అవునా?
శ్రుతి: అవును. నిజమే తాతయ్యా. నేనైతే ఒకటిని ఏడుగా దిద్ది ఉండేదాన్ని.
Sunday, September 2, 2012
ద్రాక్షపళ్ళున్నాయా
ఒకబాతు ఒక General Store కి వెళ్ళి యిలా అడుగుతుంది.
బాతు: ద్రాక్షపళ్ళున్నాయా!
షాపు ఓనరు: లేవు. ఇక్కడ ద్రాక్షపళ్ళు దొరకవు
(రెండోరోజు)
బాతు: ద్రాక్షపళ్ళున్నాయా!
షాపు ఓనరు: లేవు. పో అవతలికి.
(మూడో రోజు)
బాతు: ద్రాక్షపళ్ళున్నాయా!
షాపు ఓనరు: లేవన్నానా! పో అవతలికి. ఇంకోసారడిగితే కత్తితో కోసేస్తా!
(మర్నాడు)
బాతు: కత్తులున్నాయా?
షాపు ఓనరు: లేవు...
బాతు: అయితే ద్రాక్షపళ్ళున్నాయా?

Saturday, September 1, 2012
కుక్క- చెస్
సతీష్: మా కుక్కతో కలిసి నిన్నటిదినం చెస్ ఆడానురా
రమేష్: ఓ.. మీ కుక్క చాలా తెలివైందిగా ఉండాలి మరి.
సతీష్: అంత సీను లేదులే.. నిన్న మేమాడిన 6 ఆటల్లో నాలుగు గేమ్స్ నేనే గెలిచామరి.
రమేష్: ఓ.. మీ కుక్క చాలా తెలివైందిగా ఉండాలి మరి.
సతీష్: అంత సీను లేదులే.. నిన్న మేమాడిన 6 ఆటల్లో నాలుగు గేమ్స్ నేనే గెలిచామరి.
24 గంటలు
ఓ డాక్టర్ తన పేషెంట్‌తో యిలా అంటాడు.
"నీకో బాడ్ న్యూసు, ఒక worst న్యూసు చెప్పాలి"
పేషెంట్: బాడ్‌న్యూస్ ఏంటి డాక్టర్?
డాక్టర్: నువ్వు 24 గంటలకన్నా ఎక్కువ బతకవు.
పేషెంట్: ఓ మై గాడ్! ఇంతకన్నా worst న్యూస్ ఏముంటుంది డాక్టర్?
డాక్టర్: నీకీ విషయం చెప్పడానికి నిన్నటినుండి నిన్ను వెతుకుతున్నా ...
పేషెంట్: ఆ(

ఫారినర్స్
ఒకసారి ఒక foreigner ఇండియాలోని ఒక పల్లెటూరికి వస్తాడు. అక్కడున్న ఒక చిన్న కాకా హోటల్‌కి వెళ్ళి ఓ ఎగ్ ఆంలెట్ తిని బిల్లెంత అనడుగుతాడు.
పల్లెటూరివ్యక్తి : రెండొందలు
Foreigner: రెండొందలా! అదేంటి, మీకు ఇక్కడ ఎగ్స్ దొరకవ?
పల్లెటూరివ్యక్తి: ఓ ఎందుకు దొరకవూ ! కాని ఫారినర్సే ఎక్కువగా దొరకరు.
పల్లెటూరివ్యక్తి : రెండొందలు
Foreigner: రెండొందలా! అదేంటి, మీకు ఇక్కడ ఎగ్స్ దొరకవ?
పల్లెటూరివ్యక్తి: ఓ ఎందుకు దొరకవూ ! కాని ఫారినర్సే ఎక్కువగా దొరకరు.
Subscribe to:
Posts (Atom)