Monday, September 10, 2012

సందేహం

ఒకరోజు నాలుగో తరగతి చదువుతున్న దీప్తి వంటగదిలో పనిచేసుకుంటున్న వాళ్ళమ్మదగ్గరకు వెళ్ళి అదేపనిగా వాళ్ళ అమ్మని గమనిస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళమ్మ అడుగుతుంది.
"ఏమిటే! ఏం ఆలోచిస్తున్నావ్?"
దీప్తి: నీకు కొన్ని వెంట్రుకలు తెల్లగా ఎందుకున్నాయమ్మా?
దానికి వాళ్ళ అమ్మ అంటుంది "నువ్వు అల్లరి చేస్తూ చదువుకోకుండా చికాకు చేస్తూ  నన్ను ఏడిపిస్తావుగా! అలా ఏడిపించినప్పుడల్లా ఒక్కో వెంట్రుక తెల్లబడిపోతుంది"
ఇంతలో ఆ పాప మెల్లిగా తన ధర్మ సందేహాన్ని యిలా వెల్లబుచ్చుతుంది "మరి అమ్మమ్మ వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోయాయెందుకు? "

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version