ఇంగ్లీషు క్లాసులో రాము లేచి " మాస్టారూ! నటురె అంటె అర్ధం ఏంటండి?" అని అడిగాడు.
మాస్టారికి అర్ధం కాలేదు. " నటురెనా.....అదేం పదం? ’" అని అడిగాడు. మాస్టారికి కూడా తెలియని పదాన్ని గురించి తను అడుగుతున్నానని రాముకు గర్వంగా అనిపించింది. "అదే మాస్టారూ...ఎన్...ఎ...టి...యు...ఆర్...ఇ " అన్నాడు.
మాస్టారికి కోపం వచ్చింది. "వెధవాయ్! ఆ పాఠం నేను నెల రోజుల నుండి చెబుతున్నాను. అయినా దాన్ని సరిగ్గా ఎలా పలకాలో నీకు తెలియలేదా? దాన్ని నేచర్ అని పలకాలి. ఆ మాత్రం తెలియనివాడివి నా క్లాసులో ఉండకు. పో... ఇంకో వారం దాకా నా క్లాసులో కనిపించకు పో..." అని అరిచాడు.
రాము ఇంటికి వెళ్ళి తండ్రి సోముకు జరిగినది చెప్పి ఏడ్చాడు. సోము మాస్టారితో మాట్లాడతానని చెప్పి కొడుకుని ఓదార్చాడు. మర్నాడు బడికి వెళ్ళి ఇంగ్లీషు మాస్టారిని కలిశాడు సోము"మాస్టారూ! వారం రోజులు మావాడు ఇంగ్లీషు పాఠాలు వినకపోతే వాడి పుటురె దెబ్బ తింటుంది కదా?" అన్నాడు.
అంతే మాస్టారి కోపం నషాలానికెక్కింది. "పుటురెనా?.. అదేంటి?.."అన్నాడు. సోము అన్నాడు " అదే మాస్టారు!
ఎఫ్...యు...టు...యు...ఆర్...ఇ..
మాస్టారు "?????????????????"
No comments:
Post a Comment