నా కారు keys ఖచ్చితంగా కార్లోనే మర్చిపోయుంటాను. అనుమానంగా parking lot వైపుకు అడుగువేశాను. మా ఆయన ఎప్పుడూ నన్ను కార్లో keys మరచిపోతుంటానని తిడుతూ ఉంటారు. నా లెక్క ప్రకారం కారు ఇంజన్ on లో ఉన్నప్పుడు కారెవ్వరూ దొంగిలించలేరని, కానీ మా వారి లెక్కప్రకారం అలా ఇంజన్ ఆన్ చేసినప్పుడే కారు దొంగిలించే అవకాశం ఎక్కువ అని. చివరికి మావారి లెక్కే నిజమయింది. పార్కింగ్ లాట్ ఖాళీగా ఉంది.
నేను వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి నా అడ్రస్ చెప్పి కారు వివరాలతో కంప్లైంట్ ఇచ్చాను.
ఆఖరుగా బాధతో మా వారికి కాల్ చేశాను. "రాజేష్ ఈ! తాళాలు కార్లో మర్చిపోయాను, మన కారెవరో ఎత్తుకెళ్ళారు .!!!"
కొంచెం సేపు మౌనం , తను కాల్ కట్ చేసుంటాడనుకున్నా. కాని వెంటనే తన voice వినబడింది, " Idiot, నిన్ను drop చేసింది నేనే.
ఇప్పుడు మౌనం నా వంతయింది. ఓ నిజమా! Thank God, వచ్చి నన్ను pick-up చేసుకో...
"ఓ ఖచ్చితంగా... ఈ కారు నాదేనని ఈ పోలీస్ వాళ్ళని convince చెయ్యగానే వచ్చేస్తాను.
No comments:
Post a Comment