ఆఫీసు పనిమీద నెలరోజులు క్యాంపుకెళ్ళిన జంబులింగానికి ఫోన్ చేశాడు కొడుకు సోమలింగం
"అందరూ బాగున్నారు కదా!" అడిగాడు తండ్రి జంబులింగం
"మన కుక్కపిల్ల చనిపోయింది నాన్నా" చెప్పాడు కొడుకు.
షాక్ తిన్నాడు జంబులింగం. మెల్లిగా
తేరుకొని " ఇలాంటి వార్తలను ఒక్కసారిగా చెప్పకూడదు. ముందు కుక్కపిల్ల
గోడెక్కింది అని చెప్పాలి. తరువాత అక్కడినుండి పడింది.. కాలు విరిగింది..
హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.. లాభం లేకపోయింది.. అని మెల్లగా చెప్పాలి. సర్లే
ఏం చేస్తాం.. ఇంతకీ బామ్మ ఎలా ఉంది.." అడిగాడు జంబులింగం.
ఒక్క క్షణం ఆలోచించి -
"బామ్మ గోడెక్కింది నాన్నా.." చెప్పాడు సోమలింగం.
No comments:
Post a Comment