చంటి పుట్టినరోజుకు వాళ్ల నాన్న స్నేహితుడు రవి డ్రమ్స్ బహుమతిగా ఇచ్చాడు.
నెలరోజుల తరవాత చంటి వాళ్ళింటికి వచ్చాడు రవి.
'ఏరా చంటి.....డ్రమ్స్ నచ్చాయా? నేర్చుకుంటున్నావా?' అడిగాడు రవి.
'ఆరోజు నాకు వచ్చిన బహుమతులన్నింటిలోకీ నాకు బాగా నచ్చింది అదే అంకుల్' హుషారుగా చెప్పాడు చంటి.
'ఎందుకని?'
'పొద్దున్నే
దాన్ని వాయించకుండా ఉండటానికి నాకు అయిదు రూపాయలిస్తున్నారు నాన్న.
సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక కూడా దాన్ని వాయించకుండా ఉండటానికి అమ్మ
మరో రెండు రూపాయలిస్తోంది' చెప్పాడు చంటి.
No comments:
Post a Comment