నాసా శాస్త్రవేత్తలు ఒక
అద్భుతమైన స్పేస్ షిప్ ని తయారు చేశారు. కానీ అంతరిక్షంలోకి పంపేందుకు
ఆటంకం వచ్చింది. ఎంత ప్రయత్నించినా షటిల్ స్టార్ట్ అవ్వడంలేదు..
ఆఖరికి అక్కడ పనిచేస్తున్న జంబులింగం గారి పెద్దబ్బాయి సోమలింగం గారిని సహాయం చెయ్యమని అడిగారు.
సమస్యంతా విన్న సోమలింగం " షటిల్ ని 45 డిగ్రీల కోణంలో వంచి ప్రయోగించి చూడండి." అని సలహా ఇచ్చాడు.
శాస్త్రవేత్తలు అలానే చేశారు.. అంతే రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళిపోయింది. సైంటిస్టులు ఆనందం పట్టలేకపోయారు.
"మీకు ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది." అని అడిగారు సోమలింగాన్ని .
"ఆ .. ఏముందీ.. మాదేశంలో స్కూటర్లు స్టార్ట్ కాకుంటే.. మావాళ్ళంతా చేసేది అదే కదా..!!" అసలు రహస్యం చెప్పాడు సోమలింగం.
No comments:
Post a Comment